Hari-Hara-Kshethram

Hari Hara Kshethram: అమెరికాలో మరో ఆధ్యాత్మిక కేంద్రం ‘హరిహర క్షేత్రం’

This blog post was originally published on – https://10tv.in/telugu-news/spiritual/hindu-temple-hari-hara-kshetram-in-texas-austin-888541.html

హరిహర క్షేత్రం సందర్శకులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. ఈ బాలాలయ దివ్య క్షేత్ర సందర్శనకు విచ్చేసిన కుటుంబాలకు

♦ టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ లో శైవ, వైష్ణవ ఆలయం

♦ కన్నుల పండువగా సాగిన బాలాలయం ప్రారంభోత్సవం

♦ ఘనంగా శ్రీ వేంకటేశ్వర కళ్యాణం, సామూహిక సత్యనారాయణ వ్రతాలు

♦ భారీగా తరలివచ్చిన స్థానిక హిందూ కుటుంబాలు

♦ నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ

Hari Hara Kshethram: అమెరికాలో మరో ఆధ్యాత్మిక క్షేత్రం పురుడు పోసుకోనుంది. టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో భారీ ఆలయాన్ని నిర్మించబోతున్నారు. 375 కింగ్ రియా జార్జ్ టౌన్ లో హరిహర క్షేత్రం పేరుతో శైవ, వైష్ణవ ఆలయ నిర్మాణం చేపట్టబోతున్నారు. ఆస్టిన్ నగర శివారులో దాదాపు 25 ఎకరాల విశాలమైన స్థలంలో ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం కొలువుదీరబోతోంది. ప్రస్తుతం ఈ ప్రదేశంలో తాత్కాలికంగా బాలాలయాన్ని నెలకొల్పారు.

ఘనంగా బాలాలయ ప్రారంభోత్సవం..
ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇటీవల బాలాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కేబీకే గ్రూప్ ఛైర్మన్, సీఈఓ డా. కక్కిరేణి భరత్ కుమార్ మార్గనిర్దేశంలో అక్టోబరు 20న హరిహర క్షేత్రం బాలాలయం ప్రారంభోత్సవం కనులపండువగా సాగింది. ఈ ఆలయ ప్రారోంభోత్సవానికి స్థానికంగా ఆస్టిన్ నగరంలోని హిందూ కుటుంబాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి బాలాలయ ప్రాంగణమంతా భక్తులతో సందడిగా మారింది. వేద మంత్రోచ్ఛరణలు, ధూపద్రవ్యాలు, సాంప్రదాయ దుస్తులతో ఆ ప్రాంతం అంతా సాంస్కృతిక, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ప్రారంభోత్సవంలో భాగంగా వేద మంత్రోచ్ఛరణలతో మహా కుంభాభిషేకం అనంతరం పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం కన్నుల పండువగా సాగింది. భక్తులు పెద్ద ఎత్తున్న శ్రీవారి కళ్యాణోత్సవాన్ని తిలకించారు. అనంతరం భక్తులకు వాలంటీర్లు అన్నదానం చేశారు. ఆటపాటలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. స్థానిక కళాకారుల సంగీతం, నృత్యకారులు హిందూ పురాణాల కథలకు జీవం పోశారు. కళాకారుల బృందం, శృతి కొండాయిల నృత్య ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ బాలాలయంలో భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి, గణపతి, అయ్యప్ప స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. బాలాలయ ప్రాణ ప్రతిష్టకు ముందు కూడా ఈ ప్రదేశంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించారు. 200 పైగా ఎకో గణేష్ విగ్రహాలను పంపిణీ చేశారు. దేవీ నవరాత్రి ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

కార్తిక పౌర్ణమికి సామూహిక సత్యనారాయణ వ్రతాలు
హరిహర క్షేత్రంలో కార్తీక మాస శోభ సంతరించకుంది. ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 15న సాయంత్రం పెద్ద ఎత్తున సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ముందస్తు రిజిస్ట్రేషన్లకు ఊహించని స్పందన వచ్చింది.

ఆధ్మాత్మికం, ఆహ్లాదం..
హరిహర క్షేత్రం సందర్శకులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. ఈ బాలాలయ దివ్య క్షేత్ర సందర్శనకు విచ్చేసిన కుటుంబాలకు నిత్య పూజల అనంతరం హాయిగా సేదతీరడానికి సౌకర్యాలను నెలకొల్పుతోంది. చిన్నారులు ఆడుకునేందుకు వివిధ పరికరాలతో పార్క్ ను కూడా ఏర్పాటు చేశారు.

హరిహర క్షేత్రం క్యాంటీన్..
ఆలయ సందర్శన కోసం వచ్చే భక్తులకు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసింది ఆలయ కమిటి. హరిహర క్షేత్రం క్యాంటీన్ ద్వారా స్వచ్ఛమైన రుచికరమైన భోజన సదుపాయం కల్పించారు. ఈ సౌకర్యాలతో, హరిహర క్షేత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణంతో స్థానిక హిందువులకందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది.

టెక్సాస్ లో ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా హరిహర క్షేత్రం..
హరిహర క్షేత్ర ఆలయాన్ని ఇతర ఆలయాల కన్నా భిన్నంగా ఉండేలా నిర్మించనున్నారు. టెక్సాస్‌లోని హిందూ సమాజానికి ఆధ్యాత్మికంగా, సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. సమీప భవిష్యత్తులో సనాతన భారతీయ సంప్రదాయంతో పాటు కమ్యూనిటీపరంగా ఆధ్యాత్మికను ప్రతిబింబించే వేదికను సృష్టించడమే తమ లక్ష్యమని ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ భరత్ కుమార్ తెలిపారు. ఈ ఆధ్యాత్మిక బృందంలో దిలీప్ రెడ్డి బందెల, ప్రదీప్ రెడ్డి యాసం, ప్రణయ్ తేజ తడకమళ్ల, కిరణ్ కుమార్ కక్కిరేణి, పూర్ణ కొప్పుల, జయ వైష్ణవి కొప్పిశెట్టి, అన్విత రెడ్డి సరసాని, చక్రపాణి రెడ్డి చిట్ల, తదితరులు ఉన్నారు.

Scroll to Top